మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

by Gantepaka Srikanth |

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ ఆఫీస్‌లో ఆయుధాలు అప్పగించి.. జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రూ.67 లక్షల రివార్డును పోలీసులు వారికి అందజేశారు. మరోవైపు.. ఇప్పటికే వచ్చే జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని తెలిపారు. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు.

Next Story