- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత చంద్రన్న లొంగుబాటు
మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం ఆ పార్టీ అగ్రనేత బండి ప్రకాశ్ లొంగిపోగా, మధ్యాహ్నం మరో కీలక నేత చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు(Pulluri Prasada Rao) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పిలుపు మేరకు వీరు అజ్ఞాతం వీడారు. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. కాగా, మావోయిస్టు పార్టీలో 40 ఏళ్లకు పైగా వివిధ స్థాయిల్లో చంద్రన్న(Chandranna) పనిచేశారు. 1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్‌జీకి అనుచరుడిగా పనిచేశారు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1983లో కమాండర్ స్థాయికి వెళ్లారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. దాదాపు 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో బండి ప్రకాశ్‌తో పాటు పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని డీజీపీ స్పష్టం చేశారు.
Read More... ‘మా సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదు’.. మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు






