- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG GOVT: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. 5,020 మందికి ఉపాధి అవకాశాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు శైవా గ్రూప్, తారానిస్ క్యాపిటర్ సంస్థలు ముందుకు వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం అని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవా గ్రూప్ (Shaiva Group), తారానిస్ క్యాపిటల్ (Taranis Capital) సంస్థలు రాష్ట్రానికి చెందిన ఐదు సంస్థలతో సచివాలయంలో మంత్రి సమక్షంలో ఎంవోయూ (MoU) కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో రూ.2,125 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. దీని వల్ల 5,020 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 18 నెలల కాంగ్రెస్ పాలనలో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని చెప్పారు. ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఈరోజు మరో గొప్ప అడుగు వేయబోతున్నామని, కొత్తగా మరో 5,020 మంది తెలంగాణ యువతకు ఉపాధి దక్కబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇది కనిపించడం లేదా?
రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఇలాంటి వారికి తాము తీసుకొస్తున్న పెట్టుబడులు, ఉద్యోగాలు కనిపించడం లేదా..? ఒక్కసారి ఆలోచించాలని తెలంగాణ ప్రజలను కోరారు. రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో మరో రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవా గ్రూప్, టారనిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించారు. ఈ రెండు కంపెనీలు రాబోయే మూడేళ్లలో బయోటెక్ రంగంలో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్ మెంట్ ప్రొడక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నాయని చెప్పారు.






