- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
fraud in Hyderabad: హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో భారీ స్కామ్
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.1700 కోట్లు వసూళ్లు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad) లో మరో భారీ స్కామ్ (Fraud) వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ (Falcon Invoice) డిస్కౌంటింగ్ పేరుతో కోట్లాది రుపాయల మోసానికి పాల్పడ్డ కేసులో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడుతోంది. బ్రిటానియా, అమెజాన్, గోద్రెజ్ లాంటి సంస్థల్లో పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా 6,979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే రూ. 850 కోట్లు వసూలు చేశారు. వీటిని కాయిన్ ట్రేడ్, క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్, ఇండియా ఓకే రిసార్ట్స్, ప్రిస్టేజ్, ఫాల్కన్ ఇంటర్నేషనల్, ఆర్డీబీ, ఎంబీఆర్ దుబాయ్, కాపిటల్ టెక్సోల్, గోపాల్, ఒజాస్, లోక్ వెల్ఫేర్, స్వస్తిక్ పేరుతో ఫాల్కన్ కు అనుబంధంగా 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి బదిలీ చేశారు. గత నెల 15న బోర్డు తిప్పేశారు.






