- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pre Primary Education : విద్యార్థులకు సర్కార్ మరో గుడ్ న్యూస్
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో(Govt Schools) 2025-26 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమరీ విద్య(Pre Primary Education) అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతులను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు 5 ఏళ్లు పైబడిన పిల్లలను మాత్రమే 1వ తరగతిలో చేర్చుకుంటున్నాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుంచే విద్యను అందిస్తున్నందున తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారని, దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సీఎం గుర్తించారు. రిటైర్డ్ IAS అధికారి అకునూరి మురళి(Akunuri Murali) నేతృత్వంలోని రాష్ట్ర విద్యా కమిషన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది.
ఈ పథకం కింద, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులను ఆకర్షించలేకపోతున్న సమస్యను అధిగమించడానికి, ప్రీ-ప్రైమరీ విద్యను అందించడం ద్వారా విద్యార్థుల చేరికను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి, వారు ప్రీ-ప్రైమరీ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.






