- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన
నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్దులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. దాదాపు 16 మంది విద్యార్థులు అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. రాత్రి ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని చందునాయక్‌తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న ఆరుగురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






