బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Disha Web |
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం రామంతాపూర్ లోని ఓ ఫర్నీచర్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story