సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి పట్టివేత

by Muthe.Rajitha |

తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు.

సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి పట్టివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగుల పేరుతో సచివాలయంలోనికి వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసుల తనిఖిల్లో పట్టుకున్నారు. తాజాగా శుక్రవారం సమీర్​ అనే వ్యక్తి ఆన్​ గౌట్​ డ్యూటీ ఇన్​ సెక్రటెరియట్​ అంటూ వాహనంపై రాసి ఉన్న వాహనంతో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వాహన తనిఖిల్లో భాగంగా ఆయనను ప్రశ్నించడంతో ఆసలు విషయం బయటపడింది. పోలీసులు వివరాలు రాబట్టడానికి ప్రయత్నించడంతో తాను ఉద్యోగిని కాదని సమీర్​ పోలీసులు ముందు ఒప్పుకున్నారు. తాను సచివాలయంలో ఏవరికైనా పనులు చేసే బ్రోకరి తరహాలో పనులు చేయిస్తున్నానని తెలిపారు. దీంతో పోలీసులు సైఫాబాద్​ పోలీసులకు అప్పగించి అతనిపై కేసు నమోదు చేశారు. అతని వాహానాన్ని సీజ్​ చేశారు.

Next Story