- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిడ్నీ రాకెట్ కేసులలో మరో నిందితుడి అరెస్ట్
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐడి ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు.

- ఏ24 నిందితుడిగా డా. వెంకట రమణ సంతోష్ నాయుడు
- కేసులో 19మందిని అరెస్ట్ చేసిన సీఐడీ
దిశ, తెలంగాణ బ్యూరో: అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐడి ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. కేసులో ఏ24 నిందితుడిగా పేర్కొన్న డాక్టర్ రుత్తల వెంకట రమణ సంతోష్ నాయుడుని ఏపీలోని ఏలూరులో అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్నంలో అనస్థీషియాలజిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ వెంకట రమణ సంతోష్ కిడ్నీ రాకెట్ కేసులో ఉన్న డా. రాజశేఖర్, డా. అవినాష్ లకు సహకరించే వాడని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అలకనంద హాస్పిటల్ తో పాటు, జనని, అరుణ హాస్పిటలలో జరిగినట్లు తెలిపారు. కిడ్నీ డోనర్స్‌కు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్స్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు నిందితులకు సహకరించే వారని వెల్లడించారు. ఒక్కో కిడ్నీ ట్సాన్స్‌ప్లాంటేషన్‌కు మత్తు ఇచ్చినందుకు కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ నుంచి రూ.2.5లక్షలు డాక్టర్ వెంకట రమణ తీసుకునే వాడని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుడి జ్యుడీషియల్ రిమాండ్‌కు కొరకు ఎబీ నగర్ కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికి 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






