- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు.. సుబేదారి పీఎస్‌లోనే
హూజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy)పై మరోసారి ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హూజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy)పై మరోసారి ఫిర్యాదు చేశారు. దళిత, గిరిజన ఎమ్మెల్యేలు అయిన కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్క లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ (Subedari Police Station) సుబేదారి పీఎస్‌లో కాంగ్రెస్ (Congress) నేతలు ఫిర్యాదు చేశారు. బలవంతంగా బెదిరించి వసూళ్లు పాల్పడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు చేశారని నిన్న కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వరంగల్ ఎమ్మెల్యేల బట్టలూడదీస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని వివక్షతతోనే కేవలం తమ వారిపైననే ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.
ఆయన అనుచిత వ్యాఖ్యలతో తమ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. కావున పాడి కౌశిక్ రెడ్డి, అతనికి సహకరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్‌లపై విచారణ జరిపించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం, ఇతర చట్టాల ప్రకారం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. కాగా, క్వారీ వ్యాపారి మనోజ్ రెడ్డిని డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అవ్వడం.. నిన్న రాత్రి బెయిల్‌పై విడుదల అయ్యారు.






