- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి తలసాని మరో సవాల్
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ బీసీ నేతల(BRS BC Leaders) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ బీసీ నేతల(BRS BC Leaders) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశం అనంతరం బీసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే కార్పొరేషన్లలో మిగిలిన పదవులన్నీ, నామినేటెడ్ పదవులు బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే తమ పార్టీ బీసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లపై విన్నవిస్తామని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఢిల్లీలో సరికొత్త నాటకానికి తెరలేపబోతున్నాయని అన్నారు. ఢిల్లీ డ్రామా అనంతరం.. కేంద్రం ఒప్పుకోవడం లేదంటూ.. పార్టీకి నచ్చినట్టు టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నిలకు వెళ్లాలని, లేదంటే ఆ రెండు పార్టీలను రాష్ట్రంలో తిరగనివ్వమని అన్నారు.






