- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : మరో బాలుడిపై కుక్కల దాడి
by Sathputhe Rajesh |
అంబర్ పేట్ విషాదాన్ని మరిచిపోక ముందే మరోసారి కుక్కలు రెచ్చిపోయాయి.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: అంబర్ పేట్ విషాదాన్ని మరిచిపోక ముందే మరోసారి కుక్కలు రెచ్చిపోయాయి. చైతన్యపురి ప్రాంతంలో మరోసారి చిన్నారిపై దాడి చేశాయి. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బాలుడు బతికి బయట పడ్డాడు. చైతన్యపురి మారుతీనగర్ కాలనీలో నాలుగేళ్ల రిషి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి.
రిషి కేకలు పెట్టటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. అప్పటికే కుక్కలు రిషి వీపు, కాళ్ళు, చేతులపై గాయాలు చేశాయి. కాలనీలో కుక్కల బెడద ఉందని చాలా రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు.
కరీంనగర్‌లో..
కరీంనగర్‌లో కుక్కలు విద్యార్థిపై దాడి చేసాయి. శంకరపట్నంలో ఉన్న ఎస్‌సీ హాస్టల్లోకి చొరబడ్డ కుక్కలు సుమంత్ అనే విద్యార్థిపై విరుచుకు పడ్డాయి. ఈ సంఘటనలో సుమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story






