పంచాయతీ ఎన్నికలపై మరో బిగ్ అప్‌డేట్.. భారీగా పెరగనున్న గ్రామాలు!

by Kema Shiva Kumar |

రాష్ట్ర అత్యన్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు తెలంగాణ (Telangana)లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి.

పంచాయతీ ఎన్నికలపై మరో బిగ్ అప్‌డేట్.. భారీగా పెరగనున్న గ్రామాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అత్యన్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు తెలంగాణ (Telanagna)లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. తాజాగా, ప్రభుత్వం లోకల్ ఎలక్షన్లను సెప్టెంబర్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో 31 జెడ్పీ, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయని, 5,773 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. మరోవైపు రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో 1,12,694 వార్డులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఆ లెక్కల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన కూడా స్పష్టం చేశారు.

అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, జెడ్పీటీసీ సీట్లు 539 నుంచి 566కి పెరిగాయి. జిల్లా పరిషత్‌ల సంఖ్య 32 నుంచి 31కి తగ్గింది. ఎంపీటీసీ సీట్లు 5,817 నుంచి 5,773కు తగ్గాయి. ఇందుకు కారణం 71 గ్రామ పంచాయతీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇతర మున్సిపాలిటీలు, నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్‌లలో విలీనం అవ్వడమే. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు గ్రామాలు, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొత్త గ్రామాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తుండటంతో వాటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే పంచాయితీ ఎన్నికల నోటీపికేషన్ వచ్చే లోపు రాష్ట్రంలో గ్రామాల సంఖ్య భారీగా పెరగనుంది.

Next Story