- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలల కేసులో మరో బిగ్ ట్విస్ట్
జీహెచ్ఎంసీ (GHMC) జాయింట్ కమిషనర్ (Joint Commissioner) రాసలీలల కేసు (Illigal Affair Case)లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ (GHMC) జాయింట్ కమిషనర్ (Joint Commissioner) రాసలీలల కేసు (Illigal Affair Case)లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో పోలీసులు మరో ట్విస్ట్ (Twist) ను బయటపెట్టారు. జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జానకిరామ్ (Janakiram) కొద్ది రోజులుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని సికింద్రాబాద్ లోని వారాసిగూడలో (Varasiguda) నివాసం ఉంటున్నాడు. భర్త పై నిఘా పెట్టిన భార్య కళ్యాణి శుక్రవారం జానకిరామ్ దివ్య అనే మహిళతో ఉండటాన్ని చూసి, బంధువులతో వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, చితకొట్టింది. అంతేగాక దీనిపై వారాసిగూడ పోలీసులకు సమాచారం అందించింది.
వారాసిగూడ పోలీసులు (Varasiguda Police) సంఘటనా స్థలానికి వెళ్లే సరికి జానకిరామ్ సృహ తప్పి పడిపోయి ఉండటాన్ని గమణించి, జానకిరామ్ సహా దివ్యను గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించారు. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ను వారాసిగూడ పోలీసులు బయటపెట్టారు. జానకిరామ్ కు ఆరేళ్ల క్రితమే వివాహం జరిగిందని, కళ్యాణి రెండో భార్య అని చెబుతున్నారు. ఈ కేసుపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. 100 కు కాల్ రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్నామని, కళ్యాణి అనే మహిళ తన భర్త వేరే అమ్మాయితో ఉండగా.. బంధువులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నదని, తాము వెళ్లే సరికి జానకిరామ్ స్పృహ కోల్పోయి ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అయితే జానకిరామ్ పై తన భార్య ఫిర్యాదు చేసిందని, మొదటి భార్యAnother big twist in the GHMC Joint Commissioner Rasalila case చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నాడని తెలిపారు. అలాగే జానకిరామ్ పెళ్లి అయిన దగ్గర నుంచి శారీరకంగా హింస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నదని వివరించారు. అంతేగాక గతంలో కూడా ఉద్యోగం చేసే చోట పలువురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని కళ్యాణి ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఇక గత నాలుగు నెలలుగా భార్య కళ్యాణికి జానకిరామ్ దూరంగా ఉంటున్నాడని, దీంతో అతనిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు కళ్యాని చెప్పిందని, జానకిరామ్ పై కేసు నమోదు చేశామని, ధర్యాప్తు చేపడతాయని పోలీస్ అధికారి వెల్లడించాడు.






