- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో BIG ట్విస్ట్
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై కేసు నమోదైంది. మరోవైపు.. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ, నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణల నేపథ్యంలో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ.. సంతృప్తికరమైన సమాధానం రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా మెుత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ సహా మరో నలుగురికి డ్రగ్స్ పాటిజివ్‌గా తేలింది. ప్రస్తుతం మహేష్ బెయిల్‌పై బయట ఉండగా.. ఫాంహౌస్‌లో కాల్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు.






