- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 23 మందితో హేమ్లా విజ్జ మెగాసరెండర్!
మావోయిస్టు పీఎల్‌జీఏ బెటాలియన్-1 కమాండర్ హేమ్లా విజ్జ 23 మంది అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీ కీలక నేత, పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్-1 లో మిగిలిన చివరి కమాండర్ హేమ్లా విజ్జ (Hemla Vijja) అలియాస్ ఐతు సరెండర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు మరో 23 మందితో కలిసి లొంగిపోయేందుకు ఆయన తెలంగాణకు చేరుకుని పోలీసుల టచ్‍లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో వీరంతా పోలీసుల సమక్షంలో లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరెండర్ తో గత రెండు దశాబ్దాలుగా దక్షిణ బస్తర్ అడవుల్లో భద్రతా దళాలకు సవాల్‌గా మారిన పీఎల్‌జీఏ బెటాలియన్-1 దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
ఎవరీ హేమ్లా విజ్జ?
హేమ్లా విజ్జ (ఐతు) డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM)గా వ్యవహరిస్తూ, పీఎల్‌జీఏ మిలిటరీ వింగ్ ఇంచార్జ్‌గా, ప్లాటూన్ నం. 09/10 బాధ్యతలను చూస్తున్నారు. పీఎల్‌జీఏ బెటాలియన్-1, ఎస్బీడీ (SBD) మధ్య బలమైన వారధిగా, సప్లై టీమ్ ఇంచార్జ్‌గా కీలక పాత్ర పోషించారు. గత 20 ఏళ్లుగా దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు భారీ దాడుల్లో ఇతను ప్రధాన సూత్రధారిగా ఉన్నారు.
పీఎల్‌జీఏ బెటాలియన్-1 అంతం!:
2004లో ఏర్పాటైన పీఎల్‌జీఏ బెటాలియన్-1, దక్షిణ బస్తర్‌లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ విభాగంగా నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో భద్రతా దళాలకు అత్యధిక ప్రాణనష్టం కలిగించిన విభాగం కూడా ఇదే. ఇటీవల పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో పాటు 42 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట తమ ఆయుధాలతో లొంగిపోయారు. తాజాగా మిలిటరీ వింగ్ ఇంచార్జ్ హేమ్లా విజ్జ కూడా సరెండర్ కాబోతుండటంతో ఈ బెటాలియన్ పూర్తిగా నిర్వీర్యమైందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ లొంగుబాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన 2 లేదా 3 రోజుల్లో తెలంగాణ పోలీసులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






