- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహానగరంలో మరో దారుణం.. యువకుడిని చంపి నిప్పుపెట్టిన దుండగులు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్ వద్ద టోలిచౌకికి చెందిన మహ్మద్ అమీర్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ (Rajendra Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి హిమాయత్ సాగర్ (Himayath Sagar) సమీపంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి (Tolichawki) ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్ (Mohammad Amir) అనే యువకుడి మృతదేహాన్ని స్థానికులు హిమాయత్ సాగర్ పరిసరాల్లో కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. డెడ్‌బాడీ పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఉంది.
అయితే, మహ్మద్ అమీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఆధారాలు మాయం చేసేందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే కోణంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






