- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎస్పీఎస్సీ కేసులో మరొకరు అరెస్ట్
by samatah |
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితున్ని అరెస్ట్ చేసారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నలభై అయుదుకు పెరిగింది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితున్ని అరెస్ట్ చేసారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నలభై అయుదుకు పెరిగింది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్న రమేష్ ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాలను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రవికిషోర్ నుంచి కొన్నట్టుగా సిట్ విచారణలో తేలింది. ఈ క్రమంలో రమేష్ ను సిట్ అధికారులు వరంగల్ లో అరెస్ట్ చేసారు. రమేష్ ను జరిపిన విచారణలో అతను ఈ ప్రశ్నా పత్రాలను మరో ఇరవై మందికి అమ్మినట్టుగా వెళ్లడయ్యింది. వీరి వివరాలను సేకరించిన సిట్ అధికారులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేసారు.
Next Story






