సాహితీ ఇన్‌ఫ్రా స్కాంలో మరొకరి అరెస్ట్

by Sathputhe Rajesh |

సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఏ2 గా ఉన్న సాత్విక్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.

సాహితీ ఇన్‌ఫ్రా స్కాంలో మరొకరి అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ప్రీ లాంచ్ ఆఫర్‌తో జనాన్ని వందల కోట్ల మేర ముంచిన సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఏ2 గా ఉన్న సాత్విక్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు. బీ. లక్ష్మీనారాయణ ఎండీగా ఉన్న సాహితీ ఇన్ ఫ్రా ప్రీలాంచ్ ఆఫర్, తక్కువ ధరలకే ప్లాట్లు అంటూ వేలాది మంది నుంచి వందల కొట్లు వసూలు చేసి మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లక్మీనారాయణను పోలీసులు డిసెంబర్‌లో అరెస్ట్ చేసారు. ఇదే కేసులో సాత్విక్ రెండో నిందితునిగా ఉన్నాడు. విదేశాలకు పారిపోయే ఉద్దేశ్యంతో అతను శంషాబాద్ రాగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.

Next Story