- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Breaking News : భారత్ బయోటెక్ మరో ఘనత... ప్రపంచంలోనే వాటికి తొలి వాక్సిన్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పాడి పశువుల చర్మ సంరక్షణకు రూపొందించిన లంపీ స్కిన్ డిసీజ్(LSD) కి భారత్ బయోటెక్(Bharat Biotech) వ్యాక్సిన్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పాడి పశువుల చర్మ సంరక్షణకు రూపొందించిన లంపీ స్కిన్ డిసీజ్(LSD) కి భారత్ బయోటెక్(Bharat Biotech) వ్యాక్సిన్ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో జంతువుల ఆరోగ్యంపై భారత్ బయోటెక్ గ్రూప్ కంపెనీ బయోవెట్, పాడి పశువులకు సంబంధించిన లంపిస్కిన్ డిసీజ్ నివారణకు రూపొందించిన దివా మార్కర్ వ్యాక్సిన్(Diva Marker Vaccine) కు సోమవారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(CDSCO) ఆమోదం లభించింది.. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మొట్టమొదటి వ్యాక్సిన్(World's First Vaccine) అని భారత్ బయోటెక్ పేర్కొంది. త్వరలో ప్రారంభించబోయే బయోలంప్ వ్యాక్సిన్ పాడి పశువుల సంరక్షణకు రూపొందించిన ప్రపంచంలోని ఏకైక మార్కర్ వ్యాక్సిన్ అని అభిప్రాయపడింది.
టీకా నాణ్యత, భద్రత వంటి అంశాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IVRI) లో విస్తృతంగా పరీక్షించామని బయోవెట్ పేర్కొంది. ఇది ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించింది. అటెన్యూయేటెడ్ మార్కర్ వ్యాక్సిన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్, భారత్ బయోటెక్ యొక్క బయోవెట్ సహకారంతో అభివృద్ది చేశామని తెలిపింది. డాక్టర్. బి. ఎన్. త్రిపాఠి, డాక్టర్ నవీన్ కుమార్, ఎన్‌ఆర్‌సిఇ శాస్త్రవేత్తలు మూడు సంవత్సరాల అంకితభావంతో చేసిన పరిశోధన ఫలితంగా ఈ వ్యాక్సిన్ రూపొందించామని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు వాక్సిన్ అభివ్రుద్ది చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపింది.
ఈ సందర్భంగా బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ “ఈ దివా మార్కర్ వ్యాక్సిన్ జంతువుల్లో వ్యాధి పర్యవేక్షణ, నిర్మూలనుకు ఉపయోగపడే ఔషధమని గొప్ప ఔషదమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పాడి పరిశ్రమలో వ్యాధులు లేని పశువులు ఉండాలనే సంకల్పంతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టీకా కోసం సీడీఎస్ సీఓ లైసెన్స్ పొందడం అనేది వెటర్నరీ హెల్త్‌కేర్‌లో ఒక అద్భుత ఘట్టమని అన్నారు. విదేశీ వ్యాక్సిన్ లపై ఆధారపడకుండా పాడి పరిశ్రమకు, దేశాభివ్రుద్దికి వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గత రెండు సంవత్సరాల్లో, దేశవ్యాప్తంగా లంపి స్కిన్ డిసీజ్ కారణంగా దాదాపుగా రెండు లక్షల పశువులు చనిపోయాయి మరియు మిలియన్ల కొద్దీ వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాలను కోల్పోయాయని, బయోలంపీ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సంవత్సరానికి 500 మిలియన్ డోస్ లను బయోవెట్ మల్లూర్ ఉత్పత్తి చేయగలదని అన్నారు.






