బ‌స్వాపూర్ లో మ‌రో 60 గొర్రెలు మృతి

by Nallavelli.Anjaneyulu |

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో కందూరి సాయిలకు చెందిన మందలో నుంచి 60 గొర్రెలు గురువారం మృతి చెందాయి.

బ‌స్వాపూర్ లో  మ‌రో 60 గొర్రెలు మృతి
X

దిశ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో కందూరి సాయిలకు చెందిన మందలో నుంచి 60 గొర్రెలు గురువారం మృతి చెందాయి. తొలి రోజు 10 గొర్రెలు మృతి చెందగా.. మరుసటి రోజు ఓకే మందలోని 60 గొర్రెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం తెలిసి, పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతి చెందిన ఒక గొర్రెను నిజామాబాదులోని అదనపు పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించగా.. ప్రాథమిక పరిశీలనలో విషపూరిత పదార్థం కారణంగా మృతి చెంది ఉండవచ్చని పశు వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. చివరి నిర్ధారణ కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ విశ్లేషణకు నమూనాలను పంపించారు. గొర్రెలకు ఎక్కిన విష ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు పసి వైద్య సిబ్బంది తీసుకున్నారు. రెండు మూడు మందలు అక్కడ ఉన్నప్పటికీ ఒకే మందలోని గొర్రెలు మృతి చెందడం ఆందోళన కలిగించింది. పశుసంవర్ధక శాఖ కామారెడ్డి జిల్లా అధికారి ఎం. భరత్ ఆదేశాల మేరకు, పశు వైద్య సిబ్బంది డాక్టర్ మోనికా రెడ్డి, అనిల్ రెడ్డి, దేవేందర్, రామ్ చందర్, రాంప్రసాద్ లు గొర్రెలు మృతి చెందకుండా అవసరమైన అవసరమైన చికిత్సలను అందజేశారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, తహసీల్దార్ సునీత, గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామిలు గొర్రెలు మృతి చెందిన స్థలాన్ని సందర్శించారు.

Next Story