మల్లన్న ఆఫీస్‌పై దాడిని ఖండించిన MLA అనిరుధ్ రెడ్డి

by Gantepaka Srikanth |

మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయం(Teenmar Mallanna Office)పై దాడి జరిగిన విషయం తెలిసిందే.

మల్లన్న ఆఫీస్‌పై దాడిని ఖండించిన MLA అనిరుధ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయం(Teenmar Mallanna Office)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ దాడి ఘటనను కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) ఖండించారు. తెలంగాణలో గతంలో ఇలాంటి రాజకీయాలు లేవని అన్నారు. ఏదైనా ఉంటే కోర్టులు, పోలీస్ స్టేషన్‌ల ద్వారా చూసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదని అన్నారు.

కాగా, క్యూ న్యూస్ ఆఫీస్‌లోని ఫర్నీచర్‌, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story