Minister Seethakka : నాణ్యత లేకపోతే బ్లాక్ లిస్టులో పెడుతాం : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-20 10:22:52  IST  )

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల‌(Officials of the Women and Child Welfare Department)కు మంత్రి సీత‌క్క(Minister Seethakka)కీలక ఆదేశాలు జారీ చేశారు

Minister Seethakka : నాణ్యత లేకపోతే బ్లాక్ లిస్టులో పెడుతాం : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల‌(Officials of the Women and Child Welfare Department)కు మంత్రి సీత‌క్క(Minister Seethakka)కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగ‌న్వాడీల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న స‌రుకుల(Anganwadi supplies) నాణ్యత పై త‌నిఖీ(Quality checks)లు నిర్వహించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అంగ‌న్వాడీల‌కు అందే స‌రుకుల నాణ్యత‌పై రాజీ ప‌డోద్దని స్పష్టం చేశారు. స‌రైన స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోతే స‌ప్లైయ‌ర్ ను బ్లాక్ లిస్టు చేస్తామ‌ని హెచ్చరించారు.

మంత్రి సీత‌క్క ఆదేశాల‌తో అప్రమ‌త్తమైన అధికారులు క్షేత్ర స్థాయిలో విస్తృత త‌నిఖీలు చేప‌ట్టాల‌ని జిల్లా అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలకు అందుతున్న సరుకుల్లో నాణ్యత కొరవడిందన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారంలో నాణ్యత లేకపోతే సహించేది లేదంటూ హెచ్చరించారు.

సరుకుల నాణ్యతకు సంబంధించి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనల మేరకు సరుకుల నాణ్యత, పరిమాణం ఉన్నాయో లేదో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

Next Story