- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయజయహే తెలంగాణ నుండి చూడ చక్కని తల్లి వరకు.. అందెశ్రీ రాసిన అద్భుతమైన పాటలివే
ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ గుండెపోటుతో మరణించారు. బడికి వెళ్లకుండా.. బలపం దిద్దకుండానే అందెశ్రీ సాహితీప్రపంచంలో అడుగుపెట్టి గొప్పస్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన మరణం తెలంగాణ కవితాలోకానికి తీరనిలోటుగా మారింది. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ గుండెపోటుతో మరణించారు. బడికి వెళ్లకుండా.. బలపం దిద్దకుండానే అందెశ్రీ సాహితీప్రపంచంలో అడుగుపెట్టి గొప్పస్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన మరణం తెలంగాణ కవితాలోకానికి తీరనిలోటుగా మారింది. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు. వాటిలో అందెశ్రీ కలం నుండి వచ్చిన జయజయహే తెలంగాణ.. రాష్ట్రీయగీతంగా గుర్తించబడింది. ఈ గీతం రూపంలో అందెశ్రీ శాశ్వతంగా తెలంగాణ సమాజం నోట నిలిచిపోతారు.
ఎర్ర సముద్రం సినిమాలో మనిషి మనస్థత్వం గురించి రాసిన పాట.. మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు సైతం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన జై భోలో తెలంగాణ సినిమాలోని.. జన జాతరలో మన గీతం అనే పాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. దీంతో పాటు అందెశ్రీ రాసిన ఊరు తెలంగాణ.. నా పేరు తెలంగాణ పాట సైతం ఉద్యమం సమయంలో రోమాలు నిక్కబొడిచేలా చేసినపాటగా నిలిచింది.
ప్రకృతిపై ప్రేమతో అందెశ్రీ రాసిన పల్లెనీకు వందనాలమ్మా పాట పల్లెల గొప్పదనాన్ని చెప్పే విధంగా ఉంటుంది. ఈ పాటను రసమయి బాలకిషన్ పాడారు. గల గల గజ్జలబండి..ఘల్లు చూడు అంటూ తన సొంతజిల్లా ఓరుగల్లును గొప్పగా వర్ణిస్తూ అందెశ్రీ రాసిన పాట సొంతగడ్డపై తనప్రేమను చాటుకునేలా ఉంటుంది. వీటితో పాటు.. కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావా తల్లి, చూడు తెలంగాణ, అల్లంత దూరం చూడు, ఆడ బ్రతుకు అనే పాటలు ఎంతోమందిని కదిలించాయి.
READ MORE ....
లాలాపేట నివాసానికి అందెశ్రీ పార్థివ దేహం.. రేపు ఘట్‌కేసర్‌లో అంత్యక్రియలు






