- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందెశ్రీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: కవిత
రచయిత అందెశ్రీ (Andesri) హఠాన్మరణం తెలంగాణ సాహిత్య లోకాన్ని విషాదం లోకి నెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: రచయిత అందెశ్రీ (Andesri) హఠాన్మరణం తెలంగాణ సాహిత్య లోకాన్ని విషాదం లోకి నెట్టింది. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందిస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అందెశ్రీ మృతి (death of Andesri)పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె తన ట్వీట్‌లో "ప్రముఖ కవి, "జయ జయహే తెలంగాణ" ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం, సాంస్కృతిక పోరాటంలో ఆయన పోషించిన పాత్ర సదా స్మరణీయం. ఈ విషాద సమయంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని జాగృతి అధ్యక్షురాలు కవిత రాసుకొచ్చారు.
READ MORE ....
అందెశ్రీ కృషి చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క






