అందేశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు నాయుడు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-10 06:23:46  IST  )

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది.

అందేశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఈ విషాదకరమైన వార్తపై ఏపీ, తెలంగాణలోని ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అందేశ్రీ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో "ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని సీఎం చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు.

అలాగే మంత్రి నారాలోకేష్ స్పందిస్తూ.. :ప్రజాకవి అందెశ్రీ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. "మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు" అనే పాటతోపాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. సాహిత్యానికి అందెశ్రీ గారు అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.

READ MORE .....

కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలి : ఏపీ డిప్యూటీ సీఎం

Next Story