- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణను షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం (Andesri death) యావత్ తెలంగాణను షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆయన అంత్యక్రియలు ఈ రోజు ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో హెచ్ఎండిఏ స్థలంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అందెశ్రీ అంతియ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని.. పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం పెడతామని అన్నారు.
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందెశ్రీ స్మృతివనం (Andesri Memorial Park) ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని, ఆయన రచనలతో 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో “నిప్పుల వాగు” ను అందుబాటులో ఉంచుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అందెశ్రీకి పద్మశ్రీ (Padma Shri) ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి సహకరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి అందెశ్రీని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






