ఎద బరువు మోస్తుంది.. పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది.. యాంకర్ స్వేచ్ఛ ఆర్టికల్ వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-28 10:10:57  IST  )

ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి కాగా ఆమెది సూసైడ్ అని నిర్ధారించారు పోలీసులు. ఈ క్రమంలో ‘ఉండకుండా పోకు’ టైటిల్‌తో ఆమె రాసిన ఆర్టికల్ వైరల్ అవుతోంది

ఎద బరువు మోస్తుంది.. పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది.. యాంకర్ స్వేచ్ఛ ఆర్టికల్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి కాగా ఆమెది సూసైడ్ అని నిర్ధారించారు పోలీసులు. ఈ క్రమంలో ‘ఉండకుండా పోకు’ టైటిల్‌తో ఆమె రాసిన ఆర్టికల్ వైరల్ అవుతోంది. ఉండకుండా పోకు.. ఉండకూడని చోటుకు పోకు.. ఎద బరువు మోస్తుంది.. అలసిపోతుంది.. అలిగిపోతుంది.. పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది.. అంటూ తన గుండెలోని భారాన్ని అక్షరాల రూపంలో పేపర్‌పై పెట్టింది. పుట్టడమూ చావడమూ స్పృశించలేని వ్యధలో నిదురిస్తూనే ఉంటాను.. అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు.. అంటూ రాసుకొచ్చిన కవిత ఆమె హృదయలోతుల్లోని బాధను కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.

కాగా స్వేచ్ఛ మొదటి భర్తతో విడిపోయి పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కారణంగానే తనువు చాలించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక స్వేచ్ఛకు ఒక పాప కూడా ఉండగా.. అమ్మ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్తుండేదని.. అమ్మ ఇలా చేసుకుందని రోదిస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇలా బలవన్మరణానికి పాల్పడుతుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

Next Story