- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి.. మరో వీడియో విడుదల
తిరుమల శ్రీవారి ప్రసాదం(Tirumala Prasadam)పై ప్రముఖ యాంకర్ శివజ్యోతి(Anchor Shivajyothi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ప్రసాదం(Tirumala Prasadam)పై ప్రముఖ యాంకర్ శివజ్యోతి(Anchor Shivajyothi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. క్యూలైన్లో ఉండగా.. 'ప్రసాదం అడుక్కుంటున్నాడు. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వుతూ వీడియో చేయడంపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా ఆమె స్పందించారు. క్షమాపణ చెబుతూ మరో వీడియో విడుదల చేశారు. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని హర్ట్ చేశాయని తెలిసిందే. ముమ్మాటికీ నేను చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీకరిస్తూ బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను. పదివేల రూపాయల క్యూలైన్లో ఉన్నాననే ఉద్దేశంతోనే "నేను రిచ్" అన్నానని, అంతకుమించి వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రసాదంపై తాను చేసిన కామెంట్లకు ఎలాంటి వివరణా ఇవ్వబోనని, అది తన పొరపాటేనని ఆమె స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు మన్నించాలని ఆమె కోరారు. తాను పొరపాటున అన్నాను కానీ.. ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని చెప్పారు. అందరికీ బహిరంగ క్షమాపణ చెబుతున్నాను.. ఇంతటితో వదిలేయండి అని శివజ్యోతి రిక్వెస్ట్ చేశారు. తాను అందరి దేవుళ్లకు మొక్కుతానని.. అన్ని మతాలను గౌరవిస్తానని.. రోజూ దేవుళ్లకు పూజలు చేస్తూ వీడియోలు కూడా చేస్తున్నానని వివరణ ఇచ్చారు. ఇలాంటివి మరోసారి జరుగకుండా చూసుకుంటానని తెలిపారు. వీడియో






