- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Anchor Ravi: నేను హిందువునే.. ఛత్రపతి శివాజీకి ఫాలో అవుతా.. యాంకర్ రవి మరో వీడియో రిలీజ్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఇటీవల చేసిన స్కిట్ వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ షోలో ప్రముఖ యాంకర్ రవి (Anchor Ravi) చేసిన తీరుపై హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. రాష్ట్రీయ వానర సేన హిందూ ఆర్గనైజేషన్ నుంచి రవికి వార్నింగ్ సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి స్పందించారు. ఇది హిందువులను కించపరచడానికి చేసిన స్పూఫ్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని వీడియో ద్వారా చెప్పిన యాంకర్ రవి చెప్పారు. తాజాగా మరోసారి యాంకర్ రవి స్కిట్ విషయంపై స్పందించారు. గత రెండు రోజులుగా తనపై వివాదం చెలరేగుతోందని అన్నారు. వీడు మార్చేసుకున్నాడు.. వీడు మారిపోయాడు.. అంటూ కామెంట్స్ వస్తున్నాయన్నారు.
నేను చత్రపతి శివాజీని ఫాలో అయ్యే వ్యక్తిని.. హనుమాన్ చాలీసా చదివే వ్యక్తిని, పొద్దున లేచినప్పటి నుంచి మనసులో శివుని మంత్రం జపించే వ్యక్తిని, నేను హిందువునేనని అని చెప్పుకొచ్చారు. నా మతం అంటే నాకు ఇష్టం.. అందరిలా మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవ్యక్తినని అన్నారు. యూట్యూబ్‌లో తాను చేసిన స్కిట్ లేదని, చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ సినట్లు స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో తన నంబర్ పెట్టి హిందూ మతాన్ని హర్ట్ చేశానని పెట్టారని, దీంతో తనకు చాలా కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఒక కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోందన్నారు. షోలో భాగంగా స్టేజీపై నందీశ్వరుడిని పెట్టిన తర్వాత చెప్పులు విప్పి నిష్టతో చేసిన స్పూఫ్ అది అని స్పష్టం చేశారు. ఎవరినో హర్ట్ చేయాలని చేసిన స్కిట్ కాదన్నారు. సినిమాలో ఉన్న విధంగానే సీన్ రీ క్రియేట్ చేసినట్లు తెలిపారు. అయిన అందులో హిందూ మతాన్ని, దేవతలను తన నోటితో ఏమి అనలేదన్నారు. ఇలాంటివి భవిషత్తులో జరుగకుండా తాను జాగ్రత్త పడతానని స్పష్టం చేశారు. కాగా, బావగారు బాగున్నారా సినిమాలో నంది సీన్‌ను రీక్రియేట్ చేశారు. నంది కొమ్ముల్లో నుంచి చూస్తే హీరోయిన్ రంభ కనిపించేలా సీన్ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.