KTR : తెలంగాణలో మళ్లీ అరాచక పాలన : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-11 11:35:51  IST  )

పదేళ్లపాటు ప్రశాంతం(Peace Ful)గా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఈరోజు మళ్లీ అరాచక పాలన(Anarchy Rule)కు చిరునామాగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)విమర్శించారు.

KTR : తెలంగాణలో మళ్లీ అరాచక పాలన : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : పదేళ్లపాటు ప్రశాంతం(Peace Ful)గా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఈరోజు మళ్లీ అరాచక పాలన(Anarchy Rule)కు చిరునామాగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)విమర్శించారు. దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్(Congress) పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.

ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story