Anand Mahindra: ఒక్క నిర్ణయం చాలు.. తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఏం చెప్పారంటే?

by Ramesh Naini |

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ ఉంటారో అందరికీ తెలిసిందే.

Anand Mahindra: ఒక్క నిర్ణయం చాలు.. తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఏం చెప్పారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన తన ఖాతా నుంచి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేశారంటే నెట్టింట వైరల్ కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన తెలుగులో ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మహీంద్రా సంస్థ నుంచి కొత్తగా ఫ్యూరియో8 (Mahindra FURIO8) ట్రక్కులు మార్కెట్లోకి వచ్చాయి. దీనికి సంబంధించిన తెలుగు యాడ్ వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేశారు. అంతే కాకుండా వినూత్నంగా తెలుగులో ట్వీట్ చేసి తెలుగు నెటిజన్ల మనసును గెలిచారు. ‘ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది.. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి’ అంటూ ట్వీట్ వేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. తెలుగు భాషలో ట్వీట్ చేసినందుకు తెలుగు యూజర్లు కృతజ్ఞతలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు భాషను ప్రమోట్ చేసిందందుకు చాలా సంతోషంగా ఉందని నెటిజన్‌లు హార్షం వ్యక్తం చేశారు. తెలుగులో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. భారత్‌లో ఉన్న టాప్ వ్యాపారవేత్త ఏ తెలుగులో పోస్ట్ చేస్తుంటే.. మన తెలుగులో ఉన్న కొంతమంది పెద్ద నాయకులు మాత్రం హిందీకి గులాంగిరి చేస్తున్నారు.. అని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.

ట్వీట్ కోసం క్లిక్ చేయండి

Next Story