Sheep scam: గొర్రెల స్కామ్ కేసులో అనూహ్య పరిణామం.. వారికి నోటీసులిచ్చిన ఈడీ

by Prasad Jukanti |   (  Updated:2025-09-11 10:57:59  IST  )

బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల్ స్కామ్ కేసులో అనూహ్యం పరిణామం చోటు చేసుకుంది.

Sheep scam: గొర్రెల స్కామ్ కేసులో అనూహ్య పరిణామం.. వారికి నోటీసులిచ్చిన ఈడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ (Sheep Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా బాధితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఏపీకి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి దళారి వ్యాపారి మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాలకు మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన నిధులు స్వాహా చేశారని ఇందులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైనా కూడా కేసులు నమోదు అయ్యాయి. రూ.2.1కోట్ల మేర అక్రమాలు జరిగాయనే కోణంలో అవినీతి నిరోధకశాఖ ప్రారంభించిన దర్యాప్తులోనే సుమారు రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా తేలగా ఏసీబీ విచారణ ఆధారంగా ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. ఈక్రమంలో ఈ గొర్రెల్ స్కామ్ లో రూ.1,000 కోట్లకుపైగా దారి మళ్లి ఉంటాయనే ఈడీ అంచనాకు వచ్చింది.

Next Story