- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం.. కేంద్ర మంత్రులపై ‘సామ’ సెటైర్లు
కాళేశ్వరం (Kaleshwaram)పై జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ శానసనభలో దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు సుధీర్ఘంగా చర్చ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram)పై జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ శానసనభలో దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో రాష్ట్ర మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), విపక్ష సభ్యులు తమ అభిప్రాయలను సభ దృష్టి తీసుకొచ్చారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలని, నిజాయితీతో విచారణ జరగాలనే సీబీఐకి అప్పగించేందుకు నిర్ణయించామని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే పీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణను సిబీఐకి ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులకు సదావకాశం లభించిందని అన్నారు. కాళేశ్వరంపై విచారణ మరింత పారదర్శకంగా జరిగేందకు అసెంబ్లీలో ఆధారాలతో కూడిన నివేదికలతో పాటు కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారని తెలిపారు. ఇక కేంద్ర మంత్రులు మీరు చొరవ తీసుకుని కేసును త్వరితగతిన చర్యలు చేపట్టాలని, దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని కోరుతున్నానని కామెంట్ చేశారు. బీజేపీ మిత్రపక్షం బీఆర్ఎస్.. అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచుకుంటుందని భావిస్తున్నా అంటూ సామా రామ్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.






