- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొమ్మిదేళ్లుగా పెత్తనం.. ప్రభుత్వాలు మారినా ఆయన్నేం చేయలేకపోతున్నారా?
రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఓ అధికారి 9 ఏళ్లుపైగా ఒకే సీటుపై తిష్టవేసి కుర్చీ వదలకుండా ఒంటి చెయ్యితో పెత్తనం చెలాయిస్తున్నాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఓ అధికారి 9 ఏళ్లుపైగా ఒకే సీటుపై తిష్టవేసి కుర్చీ వదలకుండా ఒంటి చెయ్యితో పెత్తనం చెలాయిస్తున్నాడు. గత బీఆర్ఎస్పాలనలో రాజకీయ నేతల అండతో కుర్చీని సొంతం చేసుకున్న సదరు అధికారి ప్రభుత్వం మారినా ఇప్పటివరకు ఆయన సీటు కదిలించిన నాథుడే లేదు. ఇటీవల ఆయనకు స్థానం చలనం తప్పదని ప్రచారం కావడంతో మరోసారి సీటు దక్కించుకునేందుకు మంత్రుల స్థాయిలో పైరవీలకు తెరతీసినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఐదేళ్లతో పాటు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటే మరో రెండు సంవత్సరాల వరకు పొడిగింపు ఉంటుంది. కానీ ఈయన మాత్రం 9 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఓ సీనియర్మంత్రి ఆశీస్సులతో మళ్లీ విత్తనాభివృద్ధి శాఖలో కొనసాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖ అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ శాఖకు చెందిన నామినేటెడ్ చైర్మన్లు,రైతులకు సంబంధించిన సమస్యల గురించి వివరణ ఇవ్వాలని కోరినా ఏమాత్రం లెక్కచేయడు. తాను అధికారిననే సంగతి మరిచిపోయి పాలకుల మాదిరిగా వ్యవహరిస్తుంటాడని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇతని అరాచకాలకు ప్రభుత్వం పెద్దలు కళ్లెం వేయాలని పలుమార్లు వ్యవసాయ శాఖ ఉన్నాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ రాజకీయ నేతల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. రెండు ప్రభుత్వాలు మారినా ఆ అధికారి అదే స్థానంలో కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంచి నేర్పరి!
ఏ ప్రభుత్వం వచ్చినా పాలకులను తన వైపు తిప్పకోవడంతో ఆయనకు మించిన నేర్పరి లేడంటూ డిపార్టుమెంట్లో టాక్ వినిపిస్తోంది. తాను కుర్చీ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ఎన్ని ఖర్చుచేసి అయిన సొంతం చేసుకునేందుకు వెనకుండా ఎప్పటికప్పడు జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్ద నాయకులతో సంబంధాలు ఉండటంతో ఆశాఖకు చెందిన చైర్మన్లు, ఇతర అధికారపార్టీ నేతలు వస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వితన్త ధ్రువీకరణ ఆయన చేతిలో ఉండటంతో పెద్దపెద్ద విత్తన కంపెనీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారు ఇచ్చే విందులు, విలసాలకు అలవాటుపడి ఈ శాఖలో మరి కొన్నేళ్ల వరకు కొనసాగుతానని సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు తన సీటుకు ఢోకాలేదని, జారిపోకుండా తన వంతు ప్రయత్నాలు ఇప్పటికే పూర్తిచేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. సదరు అధికారి ప్రచారంతో ఇతర అధికారులు ఆ సీటు కోసం ప్రయత్నం చేయబోరనే ఎత్తుగడలో భాగంగా తన స్నేహితులతో ప్రచారం చేయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యతిరేకంగా వార్తలు వస్తే బెదిరింపులు
విత్తనాభివృద్ధి శాఖలో జరిగే అక్రమాలపై మీడియాలో కథనాలు వస్తే తట్టుకోలేడని సదరు వ్యక్తులను బెదిరింపులకు గురిచేసి సక్రమంగా ఉన్నట్లు రాయాలని దారిలోకి తెచ్చుకుంటారని విమర్శలు ఉన్నాయి. శాఖకు చెందిన చిన్న అక్రమ బాగోతం బయటకు లీకైన కిందిస్థాయి అధికారులపై రెండు మూడు రోజులపాటు చిర్రుబుర్రుగా ఉంటాడు. ఇక్కడే జరిగే ఎలాంటి వ్యవహారమైనా ఇక్కడే సమాధి కావాలని, ఇతరుల చెవిలో పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తాని హెచ్చరికలు చేస్తారని సిబ్బంది వెల్లడిస్తున్నారు.
కులం ఏమిటో గుర్తుపట్టకుండా..
సదరు అధికారి తన కులం ఏమిటో ఎవరూ గుర్తించకుడా గెజిట్లో తన పేరు కూడా మార్పు చేసుకున్నట్లు తెలిసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ఉచితంగా సేవలందించాల్సి వస్తుందనే కారణంతో తాను అగ్రకులానికి చెందిన వ్యక్తిగా చెలామణి అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రిజర్వేషన్కులానికి చెందిన అధికారిగా తెలిస్తే ఉన్నత పోస్టులు దొరకవని, ఇతర కమ్యూనిటీ పేరు చెబుతూ వారి హోదాలను అనుభవిస్తున్నట్లు ఆయన చుట్టూ ఉన్న అధికారులు వెల్లడించారు.






