- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : మిల్లా మాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలి : కేటీఆర్ డిమాండ్
హైదరాబాదు(Hyderabad)లో జరుగుతున్న మిస్ వరల్డ్(Miss Wolrd 2025) పోటీలపై.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ(Miss England Milla Maggi) సంచలన ఆరోపణలు(Alligations) చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాదు(Hyderabad)లో జరుగుతున్న మిస్ వరల్డ్(Miss Wolrd 2025) పోటీలపై.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ(Miss England Milla Maggi) సంచలన ఆరోపణలు(Alligations) చేసిన విషయం తెలిసిందే. స్పాన్సర్స్ ను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మిల్లా మాగీ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు.
ఈ మేరకు కేటీఆర్ తన X వేదికగా మాట్లాడుతూ.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలో తనపై జరిగిన చెడు అనుభవాల గురించి ముందుకు వచ్చి ధైర్యంగా, బహిరంగంగా మాట్లాడినందుకు ప్రశంసిస్తున్నాని అన్నారు. ఆమె తెలంగాణలో ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో స్త్రీలను గౌరవించే, సమాన అవకాశాలు ఇచ్చే సంస్కృతి ఉందని.. రాణి రుద్రమ(Rani Rudrama), చిట్యాల ఐలమ్మ(Chityala Ilamma) వంటి గొప్ప మహిళా నాయకులు ఇక్కడి నుండి వచ్చారని పేర్కొన్నారు.
మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవం తెలంగాణ నిజమైన సంస్కృతిని ప్రతిబింబించదని, ఆమె త్వరగా ఈ చేదు అనుభవం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఒక కూతురి తండ్రిగా, ఏ మహిళ, బాలిక ఇలాంటి అనుభవాలు ఎదుర్కోకూడదని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, బాధితురాలిని తప్పుబట్టే ప్రభుత్వ, మిస్ వరల్డ్ నిర్వాహకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలియజేశారు. మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






