పాదయాత్రలో బహిర్గతమైన వర్గపోరు

by Disha Web Desk 4 |
పాదయాత్రలో బహిర్గతమైన వర్గపోరు
X

దిశ, చందుర్తి : బీజేపీ నాయకురాలు తుల ఉమ చేపట్టిన పాదయాత్రలో బీజేపీలో అంతర్గత పోరు బహిర్గతమయింది. చందుర్తి, మేడిపల్లి రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి అయిన చందుర్తి, మోత్కూరావుపేట గ్రామాల మధ్య రోడ్డు పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ పాదయాత్ర చేపట్టారు. 60 ఏండ్ల నుండి ఈ రోడ్డు‌పై కష్టాలు పడుతున్న స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో రూ.19 కోట్ల 75లక్షలను అప్పటి మంత్రితో ప్రోసిడింగ్ ఇచ్చారని తెలిపారు. కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీకి పరిమితమయ్యి ఇక్కడ ప్రజలను గాలి‌కి వదిలేశారని తెలిపారు. మేడిపల్లి, కథలాపూర్, రాయికల్ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదన్నారు.

వారి కష్టాలు తీరే వరకు వారి వెంట వుంటానని భరోసా ఇచ్చారు. ఈ నెల 7న జగిత్యాల‌కు విచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల కోసమై ఆగమేఘాల మీద కొత్తగా రోడ్లు వేస్తున్న నాయకులు ప్రజలకు అవసరమైన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను కలిపే ప్రధాన రహదారిని ఏండ్ల నుండి అసంపూర్తిగా వదిలేసి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇది ఇలా ఉండగా పసునూరు నుండి చందుర్తి వరకు పాదయాత్ర చేసిన తుల ఉమా వెంట మేడిపల్లి, చందుర్తి మండలాలకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎవరు కనిపించలేదు. దీన్నిబట్టి చూస్తే అంతర్గతంగా వర్గపోరు నడస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో తుల ఉమ చేరారు. కాగా ఆమె చేపట్టిన పాదయాత్ర విషయం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వలేదని చర్చ జరుగుతోంది.

అందుకే బీజేపీ సీనియర్ నాయకులు పలువురు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే సీనియర్ భాజపా నాయకులు ఈరోజు చందుర్తి మండలంలోని ఆశిరెడ్డి పల్లె గ్రామంలో చెన్నమనేని వికాస్ రావు ప్రారంభం చేయబోయే వాటర్ ప్లాంట్ కార్యక్రమానికి కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు సమాచారం ఇవ్వలేదని వాళ్ళు కూడ ఆరోపించారు. బీజేపీలో పాత, కొత్తగా అంటూ నాయకులకు మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ జిల్లా నాయకులు ఈ పాదయాత్రలో కనిపించకపోవడంతో వర్గపోరు విషయం నిజమే అని టాక్ నడుస్తోంది. మండలంలో బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడి పరస్పర ఆరోపణలు చేసుకోవడం సంచలనంగా మారింది.మండల బీజేపీలోలో మూడో వర్గం కూడా ఏర్పడటంతో రానున్న రోజుల్లో మండలంలో రాజకీయ వర్గపోరు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. నాయకుల ఈ చర్యలతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే రానున్న ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించవచ్చని కొంతమంది బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


Also Read.......

దవాఖానలో అందరూ అటెన్షన్.. దిశ కథనానికి స్పందన


Next Story

Most Viewed