- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజాసింగ్కు సైబర్ వల!.. భట్టి పీఏకు కాల్‌తో అసలు గుట్టురట్టు
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ పేరుతో ఎమ్మెల్యే రాజాసింగ్ కు సైబర్ నేరగాడు బురిడీ కొట్టించే ప్రయత్నం కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బురిడీ కొట్టించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‍కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ కాల్ (Fake Call) చేసి కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని మోసానికి ప్రయత్నించగా.. అనుమానం కలగడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏతో క్రాస్ చెక్ చేసుకుని అది ఫేక్ కాల్ అని నిర్థారించుకున్నట్లు స్వయంగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీని అంటూ ఫోన్:
రాజాసింగ్ వీడియోలో వెల్లడించిన ప్రకారం.. నిన్న సాయంత్రం తనకు 7386719629 నంబర్ నుంచి కాల్ వచ్చిందని అవతలి వ్యక్తి నేను ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‍లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడని చెప్పారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ పేరుతో కొత్త పథకం ప్రారంభం అయిందని ఈ స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం సైతం అమలు చేస్తోందని చెప్పాడని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో యువకుడికి రూ.10 లక్షలు లోన్ ఇచ్చేలా ప్రతి నియోజకవర్గానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నామని దీనిపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారని తెలిపాడు. అన్ని స్కీమ్ ల విషయంలో ముందు ఉండే మీరు మరి ఈ స్కీమ్ కు ఎందుకు అప్లయ్ చేయలేదని తనను అడిగారని అందుకు ఈ స్కీమ్ తన నోటీసులోకి రాలేదని బదులిచ్చినట్లు రాజాసిగ్ చెప్పారు. అతడు చెప్పిన మాటలను మొదట తాను నమ్మానని అయితే ఇవాళ రాత్రి వరకే ఈ స్కీమ్ ఉంటుందని వెంటనే ఆధార్ కార్డులు పంపించాలని చెప్పడంతో తనకు అనుమానం కలిగిందన్నారు. దాంతో తాను వెంటనే భట్టి విక్రమార్క పీఏకు ఫోన్ చోసి క్రాస్ చెక్ చేసుకుంటే దిలీప్ కుమార్ పేరుతో అధికారి ఎవరూ లేరని పైగా ఇటువంటి స్కీమ్ ఏది లేదని చెప్పారని తెలిపారు.
ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి:
నియోజకవర్గంలో యువతకు రుణాలు వస్తాయంటే నియోజకవర్గాలలో మంచి జరుగుతుందని ఎమ్మెల్యేలమంతా సంతోషిస్తామని కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరించారు. తనకు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుని ఇంకా ఎవరెవరిని ఇలా బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.






