- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్సేన్ సాగర్ క్లీనింగ్‌లో అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ కీలక పాత్ర : మంత్రి పొన్నం
హుస్సేన్ సాగర్ క్లీనింగ్ లో అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ యంత్రం కీలక పాత్ర పోషిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్ క్లీనింగ్ లో అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ యంత్రం కీలక పాత్ర పోషిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ, సంరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అత్యాధునిక అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ ను రూ.2.87 కోట్ల వ్యయంతో ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కొనుగోలు చేసిందన్నారు. ఈ యంత్రాన్ని సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ చెరువులు, కుంటలు, మడుగు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుందని మంత్రికి అధికారులు వివరించారు. చెరువుల అడుగుభాగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం (డీసిల్టింగ్), డ్రెడ్జింగ్ పనులు, నీటి మొక్కలు తొలగింపు, చెత్త, స్లెడ్జ్ తొలగింపు, పాత చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగించబడుతుందని తెలిపారు.
హుస్సేన్ సాగర్ పరిస్థితి మెరుగుపరచడం
ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సరస్సు పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ యంత్రం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. గణేష్ చతుర్థి, దుర్గాపూజ, బతుకమ్మ, ఛఠ్ పూజ వంటి ప్రధాన పండుగల సందర్భంగా విగ్రహం నిమజ్జన కార్యక్రమాలను సాఫీగా నిర్వహించడంలో కూడా ఈ యంత్రాన్ని సమర్థంగా వినియోగించనున్నట్లు తెలిపారు. యంత్రం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతి షిఫ్ట్‌లో ఒక నైపుణ్యంతో కూడిన ఆపరేటర్, ఒక సెమి-స్కిల్డ్ ఆపరేటర్ తో పాటు అవసరమైనప్పుడు సర్వీస్ ఇంజనీర్ కూడా అందుబాటులో అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్(క్యూర్) వెంకన్న, చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్, ఎస్ఈ అప్పారావు, ఈఈ వి. శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.






