ధాన్యం డబ్బు చెల్లించండి సారూ.. ఇంకా రైతుల ఖాతాలో జమ కాని డబ్బులు

by Dishanational2 |
ధాన్యం డబ్బు చెల్లించండి సారూ.. ఇంకా రైతుల ఖాతాలో జమ కాని డబ్బులు
X

దళారులను నమ్మొద్దు.. ప్రతి ధాన్యపు గింజా మేమే కొంటాం.. చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొంటుంది.. అంటూ తెలంగాణ సర్కార్ ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లు వ్యవహరిస్తున్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్నదాతల దుస్థితి.. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ధాన్యం కొనుగోలు చేసిన రైతులను కదిలిస్తే తెలుస్తుంది. అసలు విషయానికొస్తే.. 48 గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పి రైతుల వద్ద నుంచి ధాన్యం విక్రయిస్తున్న ప్రభుత్వం 48 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పలువురి రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 21,702 మంది రైతుల నుంచి 102073.040, మెట్రిక్ టన్నుల ధాన్యం సర్కార్ కొన్నది. ఇప్పటివరకు సుమారు పదివేల మంది అన్నదాతలకు 49,510.8 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను డబ్బు చెల్లించింది. ఇంకా 11,692 మంది రైతులకు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. కానీ ఇప్పటివరకు ధాన్యం డబ్బులు రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ధాన్యం డబ్బు తొందరగా చెల్లించాలని నియోజకవర్గంలోని అన్నదాతలు కోరుతున్నారు.

దిశ, ఎల్లారెడ్డి : ఆరు నెలల పాటు అన్నదాత శ్రమించి పంటను పండిస్తే ప్రభుత్వం దళారులకు ధాన్యం విక్రయించకూడదు అని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పి రైతుల వద్ద నుంచి ధాన్యం విక్రయిస్తున్న ప్రభుత్వం. ఎంతో కష్టపడి దాన్యంలో ప్రభుత్వాన్ని విక్రయిస్తే 48 గంటలు కాదు కదా 48 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు తమ ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల వద్ద నుంచి ధాన్యం 21 వేల 702, మంది రైతుల నుంచి102073.040, మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇప్పటివరకు సుమారు పదివేల మంది రైతులకు 49,510.8 మెట్రిక్ టన్నులకు ధాన్యం డబ్బులు1019.922 డబ్బులు చెల్లించినట్లు ఇంకా రైతులకు 11,692 మంది రైతులకు గాను 52,562. 240 మెట్రిక్ టన్నుల ధాన్యంకు సుమారు 108.2 6 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఇప్పటివరకు రైతులకు రైతులకు ధాన్యం డబ్బులు రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలు శ్రవించి పండించిన పంట డబ్బులను ప్రభుత్వానికి విక్రయిస్తే త్వరితగతన డబ్బులు చెల్లించాలని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంట నష్టపోయిన రైతులకు అకాల వర్షం వడగండ్ల వానకు రైతులు అధిక సంఖ్యలో నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారుల చేత ప్రభుత్వం సర్వేలు నిర్వహించి త్వరలోనే డబ్బులు ఎకరానికి రూ.10 వేలు చెల్లిస్తామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తెలిపినప్పటికీ ఇప్పటికీ డబ్బులు రాకపోవడం పట్ల రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వం సంబర పడుతుంది కానీ రైతన్న మాత్రం అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. త్వరలోనే వర్షాకాలం పంటలు ప్రారంభమై సమయం ఆసనం అవడంతో అన్నదాతకు విత్తనాలు కొనుక్కోవడానికి ప్రభుత్వం వద్దనే తమ డబ్బులు ఉండడంతో సతమతమవుతున్నారు.



Next Story