Amity University: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో అమిటి యూనివ‌ర్సిటీ చాన్స్‌ల‌ర్ భేటీ.. ఎందుకంటే?

by Ramesh Naini |

తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి త‌మ వంతుగా సేవ‌లు అందిస్తామ‌ని అమిటీ యూనివ‌ర్సిటీ చాన్స్‌ల‌ర్ అతుల్ చౌహాన్ తెలిపారు.

Amity University: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో అమిటి యూనివ‌ర్సిటీ చాన్స్‌ల‌ర్ భేటీ.. ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి త‌మ వంతుగా సేవ‌లు అందిస్తామ‌ని (Amity University) అమిటీ యూనివ‌ర్సిటీ చాన్స్‌ల‌ర్ అతుల్ చౌహాన్ (Atul Chauhan) తెలిపారు. గురువారం (Delhi) ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ‌లో త‌మ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసినందుకు సీఎంకు అతుల్ చౌహాన్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. రాష్ట్రంలో (Skill Development) స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామ‌ని, కార్యక్రమాల్లో భాగ‌స్వాముల‌వుతామ‌ని చౌహాన్ చెప్పారు. మెరుగైన వ‌స‌తులు, నాణ్యమైన విద్యాబోధ‌న‌తో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉంద‌ని, తెలంగాణ‌లో మ‌రింత‌గా రాణించేందుకు కృషి చేస్తామ‌ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమిటీ యూనివ‌ర్సిటీ ప్రతినిధి రామ‌చంద్రం పాల్గొన్నారు.

Next Story