- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి సోమవారం అధికారిక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి సోమవారం అధికారిక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. జూన్ చివరివారంలో అమిత్‌షా తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం(National Turmeric Board) ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.






