- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీలిమిటేషన్.. తెలుగు రాష్ట్రాల సీట్లపై లోక్‍సభలో అమిత్ షా కీలక ప్రకటన
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారాన్ని అమిత్ షా తోసిపుచ్చారు. ఏపీ, తెలంగాణలో పెరగనున్న సీట్లపై కీలక ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్‍తో (Delimitation) దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, నిజానికి ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ లోక్‍సభలో (Lok Sabha) డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడిన ఆయన డీలమిటేషన్‍తో తెలంగాణలో లోక్‍సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్‍లో లోక్‍సభ సీట్లు 25 నుంచి 38 కి పెరుగుతాయన్నారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాదిలో జనాభా కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయని సౌత్‍లో ఎవరికి అన్యాయం జరుగుతుందో సభ్యులు చెప్పాలన్నారు. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా వివరాలు చెబుతున్నామన్నారు. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయని, జనరల్ సీట్లలోనూ మహిళలకు అవకాశం ఇస్తే మహిళా ఎంపీల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్నారు. జనాభా లెక్కలతోనే కులగణన చేస్తామన్నారు.






