Operation Kagar : మావోయిస్టులకు అమిత్ షా మరో వార్నింగ్

by Muthe.Rajitha |

ఆపరేషన్ కగార్(Operation Kagar) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).

Operation Kagar : మావోయిస్టులకు అమిత్ షా మరో వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ కగార్(Operation Kagar) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah). నేడు నిజామాబాద్(Nizamabad) లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(Turmeric Board office) అమిత్ షా ప్రారంభించారు. అనంతర ఏర్పాటు చేసిన కిసాన్ సభ(Kisan Sabha)లో పాల్గొన్న ఆయన.. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు(Maoists) హత్యాకాండ వదిలి రావాలని సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని, 2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ ను స్థాపించి తీరుతాం అన్నారు.

నక్సలైట్లను ఏరిపారేయలా వద్దా అని సభలో ప్రజలను ప్రశ్నించారు? అలాగే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పామని పేర్కొన్న అమిత్ షా.. రాహుల్ గాంధీ నోట పాకిస్తాన్ జపం ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయంఅని తెలుస్తోందన్నారు.

Next Story