- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు నిజామాబాద్ కు అమిత్ షా రాక.. జాతీయ పసుపుబోర్డు ప్రారంభం
కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా (Amit Shah) నేడు నిజామాబాద్ కు రానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా (Amit Shah) నేడు నిజామాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపుబోర్డును ప్రారంభించి.. నిజామాబాద్ - కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
పసుపు పంటకు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు అనేక సంవత్సరాలు ఉద్యమాలు నిర్వహించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ డిమాండ్ నేపథ్యంలో 176 మంది రైతులు ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం వ్యాప్తంగా దృష్టి ఆకర్షించిన సంఘటనగా నిలిచింది.
అప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని ఈరోడ్, మహారాష్ట్రలోని సాంగ్లీ తర్వాత దేశంలో మూడో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలోని నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం పసుపు రైతులకు ఊరటనిచ్చేలా ఉంది.
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు సాగు విస్తృతంగా ఉంటుంది. ప్రతి ఏడాది దాదాపు 8 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి నమోదు అవుతోంది. జాతీయ స్థాయి బోర్డు ఏర్పడితే మద్దతు ధర కల్పనతో పాటు రైతుల దిగుబడులను నేరుగా ప్రభుత్వ సంస్థలే సేకరించనుండటం వల్ల రైతులకు మంచి మార్కెట్ లభించనుంది. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు దిగుమతి – ఎగుమతులకు సంబంధించి ప్రత్యేక అవగాహన, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.






