హైదరాబాద్ గణేష్ శోభయాత్రకు అమిత్ షా.. ఆ రెండు చోట్ల ప్రసంగం

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటన ఖరారైంది.

హైదరాబాద్ గణేష్ శోభయాత్రకు అమిత్ షా.. ఆ రెండు చోట్ల ప్రసంగం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో నిర్వహించేబోయే గణేష్ శోభయాత్ర(Ganesh Procession)లో పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. 6వ తేదీన నగరంలోని చార్మినార్, మొజంజహీ మార్కెట్ దగ్గర అమిత్ షా ప్రసంగాలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం అనంతరం తెలంగాణ బీజేపీ(Telangana BJP) ముఖ్య నేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు. కాగా, ఇప్పటికే గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల‌కు భాగ్య‌న‌గ‌రం ముస్తాబైంది. ఇప్పటికే దాదాపు 30 శాతం గ‌ణ‌నాథులను నిమ‌జ్జ‌నం చేయ‌గా, మిగ‌తా విగ్ర‌హాల‌ను మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు ప్ర‌ధాన శోభాయాత్ర కొన‌సాగ‌నుంది. ప్ర‌ధాన శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే. అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

Next Story