తెలంగాణలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇకపైన ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నది తమ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు అమిత్ షా.

దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. అసాధ్యం కానీ, ఎన్నో విజయాలను బీజేపీ సొంతం చేసుకుంద‌ని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు రాబట్టినట్లు వెల్లడించారు. ఇకపైన దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇక అమిత్ షా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూట‌మి ఏర్పాటు కావ‌డం క‌ష్ట‌మేనంటున్నారు.

Next Story