- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమి పోయే.. నష్టపరిహారం రాదాయే..!
రైతులకు జీవనాధారమైన భూమి RRR నిర్మాణంలో ప్రభుత్వం తీసుకోగా దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా అందకపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

దిశ, నర్సాపూర్: రైతులకు జీవనాధారమైన భూమి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వం తీసుకోగా దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా అందకపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్, తిర్మలాపూర్ గ్రామాలకు చెందిన రైతుల భూములు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సేకరించడం జరిగింది. ఇరు గ్రామాలకు సంబందించిన 224/22 నుంచి మొదలుకొని సర్వేనెంబర్లలో గల సుమారు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సేకరించింది. అందరి రైతుల లాగానే ఈ రైతులకు కూడా అదికారులు నోటీసులు పంపి ఎంత డబ్బు వస్తుందో బిల్లు చేసి కూడా అందించడం జరిగింది. తీరా బిల్లు చెల్లింపు సమయంలో అట్టి భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందని అధికారులు రైతులకు వివరించారు. భూమి పోయిన నష్టపరిహారం అయిన వస్తుందిలే అని అనుకున్న రైతులకు ప్రభుత్వం నుండి ఎదురుదెబ్బ తగిలింది. రీజనల్ రింగ్ రోడ్ లో పోతున్న భూమి ఫారెస్ట్ ల్యాండ్లో ఉందని అధికారులు చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. 1954 సంవత్సరం నుండి ఈ భూములపై లోన్లు, రైతుబందు, కిసాన్ సమ్మాన్ నిధి, ట్రాక్టర్లు, లోన్లు తదితర లోన్లు తీసుకున్నామని రైతులు వాపోతున్నారు. ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఇప్పటి వరకు లోన్లు ఎందుకు ఇచ్చారని రైతులు అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భూమిని కోల్పోయి పుట్టేడు దుఖఃలో ఉంటే ఫారెస్ట్ భూమి అంటూ కొర్రీలు పెట్టడం ఎంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు
డబ్బు వస్తుందని పేపర్లు ఇచ్చారు
ఆర్ ఆర్ ఆర్ కోసం రెండు ఎకరాలన్నర భూమి తీసుకున్న తర్వాత పేపర్లు ఇచ్చి నీకు డబ్బు ఇస్తామని అధికారులు చెప్పారు. గత 72 సంవత్సరాల నుండి భూమి కాస్తులో ఉన్నాను. కానీ ఇప్పుడు అడవి భూమి అని చెబుతున్నారు. ఆర్డీవో ఆఫీసుకు వెళితే డబ్బు వేయడానికి అంతా సిద్ధంగా ఉందని, పై అధికారులు వేయమంటే వేస్తామంటున్నారు. నా తోటీ వాళ్లందరికీ డబ్బు పడ్డాయి. నాకు నూత్రం వేస్తలేరూ. నాతో పాటు ఇంకో 80 మంది రైతులు డబ్బు పడక బాధలో ఉన్నారు. ఈ భూమిపైన క్రాప్ లోన్, సబ్సీడీ, రుణమాఫీ, రైతు భరోసా తీసుకున్నాను. ఈ భూమికి సంబంధించిన కాస్రా పహాణీలు కూడా ఉన్నాయి, కాని ఇప్పుడు అందులో అడవి అని చూపిస్తుందట... నష్టపరిహారం వస్తుందని అప్పు చేసి పౌల్ట్రీ ఫామ్ కట్టాను ఇప్పడు నా పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలి.
రైతులకు న్యాయం చేయండి
అందరి రైతుల లాగానే ఈ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించి న్యాయం జరిగేలా చూడాలి గతంలో అట్టి భూమిపైన, లోన్లు, ప్రభుత్వ సబ్సిడీలు తీసుకున్న రైతులకు నష్టపరిహారం ఎందుకు చెల్లించరు. ఆర్ ఆర్ ఆర్ భూములు సేకరించేటప్పుడు బాధిత రైతులను నోటీసులు పంపించి ఆవార్డు క్రింద సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. కానీ నేడు వారికి నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు. భూములు సేకరించేటప్పుడే ప్రభుత్వం, అధికారులు ఆసైన్డ్ భూమా, ఫారెస్ట్ భూమా. ప్రభుత్వ భూమా అని చూసుకోవాలి. అందులో చాలా మంది గిరిజను రైతులు ఉన్నారు. వారికి అన్యాయం జరుగకుండా న్యాయం జరిగేలా
ఆర్డీఓను ఆశ్రయించిన రైతులు..
ఈ విషయంపై బాధిత రైతులు మంగళవారం నర్సాపూర్ ఆర్టీవోను కలవడానికి కార్యాలయానికి వచ్చారు. కానీ, ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక వెనుతిరిగారు. తమ బాధ ను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటూ రైతులు అనేదన వ్యక్తం చేశారు. 1954 నుంచి కాస్తులో ఉన్నా మని ఇప్పుడు పారెస్ట్ భూమి అనడం భావ్యం కాదని రైతులు వాపోయారు. భూములు కోల్పోతున్న అందరికి నష్టపరిహారం చెల్లించి మాకు పెండింగ్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇందు లో గిరిజన రైతులు చాలా మంది ఉన్నారని, భూమి నమ్ముకునే బతికే వాళ్ళమని ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని గోడు వెల్లబోసు కున్నారు.






