- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటిగా ఇది నాకు ఒక పెద్ద సవాల్.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం: సంయుక్త మీనన్
తాను విజయ్ సేతుపతికి చాలా పెద్ద అభిమానినని సంయుక్త మీనన్ తెలిపారు. ఆయన నటనను అంత దగ్గర నుండి చూడటం మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.

దిశ, సినిమా: తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన సంయుక్త మీనన్ గత ఏడాది ‘అఖండ-2’ తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు అదే ఫామ్‌లో చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోల సరసన నటిస్తూనే, ‘బ్లాక్ గోల్డ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘స్లమ్‌డాగ్-33 టెంపుల్ రోడ్’. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని హీరో, దర్శకుడి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను విజయ్ సేతుపతికి చాలా పెద్ద అభిమానినని సంయుక్త మీనన్ తెలిపారు. ఆయన నటనను అంత దగ్గర నుండి చూడటం మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. విజయ్ సేతుపతి సెట్‌లో ఉన్నప్పుడు థియేటర్లలో చూసేదానికంటే ఒక విభిన్నమైన ఎనర్జీని తీసుకొస్తారని అన్నారు.
ఆయన ఏదైనా పాత్రలోకి మారే తీరు ఎంతో సహజంగా ఉంటుందని, ముఖ్యంగా ఆయన డైలాగ్స్ చెబుతుంటే అవి ఏదో స్క్రిప్ట్ చూసి చెప్పినట్లు కాకుండా నిజంగా ఆయన లోపల నుంచే వస్తున్నట్లు అనిపిస్తుందని మెచ్చుకున్నారు. ఒక కో-స్టార్‌గా ఆయన యాక్టింగ్ ప్రాసెస్‌ను గమనించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు సంయుక్త పేర్కొన్నారు. ఈ ‘స్లమ్‌డాగ్’ సినిమాలో తన క్యారెక్టర్ చాలా అందంగా ఉండటమే కాకుండా, అందులో ఎన్నో విభిన్నమైన షేడ్స్ ఉంటాయని సంయుక్త వివరించారు. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇదొక పెద్ద సవాల్ అని, ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేసే అవకాశం రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు పూరి జగన్నాథ్ పనితీరుపై కూడా సంయుక్త ప్రశంసలు కురిపించారు. పూరి జగన్నాథ్ సినిమాలు తీసే విధానం చాలా స్టైలిష్‌గా, అందంగా ఉంటుందని కొనియాడారు. ఆయన టైమ్ మేనేజ్‌మెంట్ చాలా గ్రేట్ అని, అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ చేసి షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేస్తారని చెప్పారు. ఆయన వర్కింగ్ స్టైల్‌ను ప్రత్యక్షంగా చూడటం ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు






