- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పోలీసులపై యువతి ఆరోపణలు... ఉన్నతాధికారుల వివరణ ఇదే
అర్థరాత్రి సహాయం కోరిన యువతిపై నోటికొచ్చినట్టు మాట్లాడారంటూ వైరల్ అయిన ఘటనపై ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : అర్థరాత్రి సహాయం కోరిన యువతిపై నోటికొచ్చినట్టు మాట్లాడారంటూ వైరల్ అయిన ఘటనపై ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అర్థరాత్రి యువతి ఫోన్ చేసిన మాట వాస్తవేమనని, అయితే తాము ఎలాంటి నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వలేదని చందానగర్ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇక్కడ తమకు రాత్రి అత్యవసర సేవలు ఉంటే కష్టం అవుతుందని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు క్యాబ్ బుక్ చేస్తామని చెప్పినా వినిపించుకోకుండా, వస్తే మీరు రండి లేదంటే వద్దు అంటూ రాపిడోలో వెళ్లిపోయిందని వివరణ ఇచ్చారు. అయితే ఆదివారం రాత్రి విజయవాడ నుంచి వస్తున్న రైలు ఆలస్యం కావడంతో అర్ధరాత్రి దాటాక ఒంటరిగా లింగపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ యువతికి, సహాయం చేయకపోగా లోకల్ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
"నిన్ను ఇంటి దగ్గర దింపాలని మాకు ఏమైనా రూల్ ఉందా? ముందే జాగ్రత్త పడాలి కదా" అంటూ పోలీసులు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించడంతో, మహిళా భద్రతపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారం కాస్తా ముదరడంతో తక్షణమే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఆ సమయంలో ఫోన్ కాల్ అటెండ్ చేసిన సిబ్బంది ఎవరు, ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పగా.. నేడు చందానగర్ పోలీసుల నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.






